- Advertisement -
నవతెలంగాణ – మిర్యాలగూడ
పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ లో చైతన్య పాఠశాల లో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు జాతీయ నాయకుల వేషదరణతో అలరించారు.ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం పాఠశాలలో సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. జాతీయ నాయకులు చేసిన త్యాగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండ్ నర్సిరెడ్డి అలాగే పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ జయంతి, రంగారావు, వెంకటేశ్వర్లు, వినోద్, చంద్ర, సబితా, భవాని, జ్యోతి, కళ్యాణ, సృజన, పాల్గొన్నారు.
- Advertisement -



