Saturday, November 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన

ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
వేల్పూర్ మండల కేంద్రంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణ పనులకు  మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ అందించిన రూ. 1.03 కోట్ల నిధులతో చేపడుతున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. తన స్వంత గ్రామంలో వివిధ అభివృద్ధి కొరకు సుమారు రూ.2.20 లక్షల నిధులు మంజూరు ఇచ్చిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కు  గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. అంతకుముందు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి పాఠశాల ఉపాధ్యాయ బృందం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆయనను శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -