నవతెలంగాణ – వనపర్తి
ఉన్నత విద్యను అభ్యసించిన యువత ఉద్యోగ అన్వేషణతో పాటు స్వయం ఉపాధి పై దృష్టి సారిస్తే భవిష్యత్ బాగుంటుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో దిండు ధర్మేందర్, శ్రీరాములు అనే యువకులు ఏర్పాటు చేసుకున్న పేపర్ ప్లేట్ తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుని ఉద్యోగాల అన్వేషణ చేస్తూనే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్న యువకులు ఇద్దరినీ అభినందిస్తున్నానన్నారు. చేస్తున్న వృత్తిని దైవంగా భావిస్తే ఆర్థిక పురోభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, మాజీ జెడ్పీటీసీ వెంకటస్వామి, మాజీ సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, బాల చంద్రయ్య, వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
యువత స్వయం ఉపాధి.. భవిష్యత్ మార్గాలకు పునాది: ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



