Saturday, November 15, 2025
E-PAPER
HomeNewsరాజ‌కీయాల‌కు లాలూ కూతురు రోహిణి ఆచార్య వీడ్కొలు

రాజ‌కీయాల‌కు లాలూ కూతురు రోహిణి ఆచార్య వీడ్కొలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య శనివారం రాజకీయాలకు, కుటుంబంతోనూ సంబంధాలు తెంచుకుంటున్నట్లు బహిరంగ ప్రకటన చేశారు.

‘‘రాజకీయాలను వదిలేయడంతో పాటు కుటుంబంతో సంబంధాలు కూడా తెంచుకుంటున్నాను. సంజయ్ యాదవ్, రమీజ్ కోరుకుంది ఇదే. పూర్తి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ చేశారు. సంజయ్‌ యాదవ్‌ తేజస్వి యాదవ్‌ సలహాదారు కాగా.. రమీజ్‌ ఎవరనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

లాలూ కొడుకులు తేజ్ ప్రతాప్ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌ల మధ్య చాలాకాలంగా విబేధాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో తేజ్‌ ప్రతాప్‌ .. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడంటూ ఎన్నికల ముందు ఆర్జేడీ బహిష్కరించింది. దీంతో జనశక్తి జనతా దళ్ (JJD) అనే కొత్త పార్టీ ప్రారంభించి మహువా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -