Saturday, November 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కపాస్ కిసాన్ యాప్ పై అవగాహన 

కపాస్ కిసాన్ యాప్ పై అవగాహన 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
మునుగోడు సహాయ వ్యవసాయ సంచాలకులు బి.వేణుగోపాల్ ఆధ్వర్యంలో శనివారం మండలంలోని మర్రిగూడ, కమ్మగూడ, తమ్మడపల్లి, ఎరగండ్లపల్లి గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి అమ్ముకోవడానికి స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలో రైతులకు అవగాహన కల్పించారు. 17 వ తేదీ నుండి రైతులు స్లాట్ బుక్ చేసుకొని పత్తి అమ్మకాలు చేసుకోవచ్చని, దళారుల వద్ద తక్కువ ధరకు పత్తిని అమ్ముకొని రైతులు మోసపోవద్దని అని అన్నారు. తేమశాతం 8 నుండి 12 శాతం వరకు ఉండేటట్టు చూసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిసిఐ కొనుగోలు కేంద్రాలలో అమ్ముకొని మద్దతు ధర పొందాలని సూచించారు. పత్తి కొనుగోలులో ఏదైనా సందేహాలు ఉంటే సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మర్రు సాహస్,వ్యవసాయ విస్తరణ అధికారులు విజయ్,నాగ స్వాతి,రాధిక,శ్రీలత,సుజాత,రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -