Saturday, November 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా బోధన చేయాలి

అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా బోధన చేయాలి

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
విద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచనలకు పదును పెట్టి అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక జీనియస్ పాఠశాల లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ ను పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ బి సూర్యనారాయణ రెడ్డి, చైర్మన్ పడాల శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు తమ జ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవడానికి ఉపాధ్యాయులు శాస్త్రీయపరమైన బోధనలు చేయాలని అన్నారు. కరస్పాండెంట్ డాక్టర్ బి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తమ జ్ఞానాన్ని పెంచుకోవడానికి పరిశోధనాత్మకమైన నైపుణ్యాలు మెరుగుపరచుకోవడానికి సైన్స్ ఫెయిర్ ఒక మంచి అత్యుత్తమ వేదికగా నిలుస్తుందని అన్నారు. చైర్మన్ పడాల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి కొత్త కొత్త అంశాలను కనుగొనే దిశగా ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బి స్వర్ణలత, వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -