- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కార్తీకమాసం ఏకాదశి సందర్భంగా చుక్కాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు సుమారు 15 జంటలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి, నిజామాబాదు, సిరిసిల్ల తదితర జిల్లాలో నుండి భక్తులు వచ్చి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి, ఈ ఓ ప్రభురాంచంద్రం గుప్తా, ఆలయ అర్చకులు, జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్, సిబ్బంది, వివిధ గ్రామాలలో నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.
- Advertisement -



