- Advertisement -
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : హుస్నాబాద్ మండలంలోని బంజేరుపల్లి గ్రామంలోని ఐకెపి సెంటర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపిఎం బబ్బురు తిరుపతి శనివారం పరిశీలించారు. రైతులకు ఏలాంటి సమస్య లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. సెంటర్ కు తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కంట వేసి మిల్లులకు పంపిస్తున్నట్లు చెప్పారు. రైతులు ఐకెపి కొనుగోలు కేంద్రాలకు దాన్యం తీసుకోవచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని తెలిపారు.
- Advertisement -



