శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ను పరిశీలించిన సబ్ కలెక్టర్
నవతెలంగాణ – మిర్యాలగూడ
పారిశుద్ద్యాన్ని మెరుగుపరిచి పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలని సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ అన్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. మున్సిపల్ సిబ్బందికి అధికారులకు పలు సూచనలు చేశారు. మిర్యాలగూడ పట్టణంలోని ప్రధాన రహదారిపై చెత్తాచెదారం నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. ప్రధానంగా డ్రైనేజీలో మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వారానికి రెండుసార్లు డ్రైనేజీని శుభ్రం చేయాలని సూచించారు. పారిశుద్ధం మెరుగుదల విషయంలో సిబ్బంది నిర్లక్ష్మo వహించకూడదన్నారు. ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, అర్ ఓ జ్ఞానేశ్వరి, శ్వేత రెడ్డి, శంకర్, షాబాజ్ తదితరులు పాల్గొన్నారు.
పారిశుద్ధాన్ని మెరుగుపరచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



