నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణములోని మినీస్టేడియం నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయం వరకు బీటీ రోడ్డు పనులు ప్రారంభయ్యాయి. మాజీ కౌన్సిలర్ న్యాయవాది శ్రీమతి సంగీత ఖాందేశ్ విన్నపం మేరకు నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డి కృషి వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వములో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిధులు మంజూరు చేయగా పనులు ప్రారంభయ్యాయి. మాజీ కౌన్సిలర్, ప్రముఖ మహిళా న్యాయవాది సంగీతా ఖాందేష్ పనులను శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా సంగీతా ఖాందేష్ మాట్లాడుతూ రెండవ వార్డులో ఇంకా ఇతర సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి నియోజక వర్గ ఇంచార్జి వినయ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించారని త్వరలో అట్టి పనులు ప్రారంభవుతాయని అన్నారు. ఈ నిధులను మంజూరు చేయించిన వినయ్ కుమార్ రెడ్డి, కమీషనర్ లకు సంగీతా ఖాందేష్ తో పాటు స్థానికులు, కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమములో కాంగ్రెస్ నాయకులు ఖాందేష్ సత్యం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలో బీటీ రోడ్డు పనుల ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



