Saturday, November 15, 2025
E-PAPER
Homeజిల్లాలుముదిరాజ్ సమాజ అభివృద్ధికి ప్రజాప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 

ముదిరాజ్ సమాజ అభివృద్ధికి ప్రజాప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ – మిడ్జిల్ 
ముదిరాజ్ సమాజాభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, ముదిరాజుల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని 100% సస్పిడితో ముదిరాజులకు చేప పిల్లలను ఉచితంగా ప్రజా ప్రభుత్వం పంపిణీ చేస్తుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని నల్లచెరువులో చేప పిల్లలను జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి మాజీ జెడ్పిటిసి గౌస్ రబ్బానితో కలిసి చేప పిల్లలను చెరువుల వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నల్లచెరువులో వదిలిన అధిక నాణ్యత గల చేప పిల్లలు వచ్చే నెలల్లోనే మత్స్యోత్పత్తి పెరుగుదలకు దోహదం చేస్తాయని అన్నారు. దీని ద్వారా స్థానిక మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక లాభాలు చేకూరతాయని అన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మత్స్యకారులకు నాణ్యమైన చేప పిల్లలు అందక, 50 శాతం మాత్రమే చిన్న సైజు చేపల పంపిణీ జరిగిందని గుర్తు చేశారు. దీనివల్ల మత్స్యకారులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, చేపల సైజు పెంచి 100% చేప పిల్లల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా చేయాలని తాను స్వయంగా ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగిందని  తెలిపారు. ఇటీవల నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో మత్స్యశాఖకు నిధులు కేటాయించాలని మంత్రి వాకిటి శ్రీహరి  ప్రతిపాదించగా.. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి మత్స్యశాఖ అభివృద్ధి కోసం రూ.123 కోట్ల నిధులు కేటాయించడం ప్రజా ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను రుజువు చేస్తుందని చెప్పారు.

జడ్చర్ల నియోజకవర్గంలోని 389 చెరువులకు దాదాపుగా 49.53 లక్షల చేప పిల్లలను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపల పెంపకానికి అవసరమైన అన్ని సౌకర్యాలు, సాంకేతిక సహకారం, శిక్షణను కూడా అందిస్తోందని ఆయన వెల్లడించారు. ప్రతి గ్రామంలో చెరువులను అభివృద్ధి చేసి వాటిని రైతులు, మత్స్యకారులకు ఉపయుక్తంగా మార్చేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ముదిరాజ్ సంఘం నాయకులు పల్లె తిరుపతి, ఎడ్ల శంకర్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో చేపల ఉత్పత్తి పెంచడంతోపాటు మార్కెట్లో ఏర్పాటు చేయాలని  కోరారు.

కార్యక్రమంలో మత్సశాఖ జిల్లా అధ్యక్షులు గోనెల శ్రీనివాసులు మత్స్య శాఖ అధికారులు, తాసిల్దార్ పులి రాజు, ఎంపీడీవో గీతాంజలి, మండల ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు,  స్థానిక  మత్స్యకారులు, సాయిలు, మల్లికార్జున రెడ్డి, వెంకటయ్య, ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపిటిసి సభ్యులు మహమ్మద్ గౌస్, వెంకట శివప్రసాద్, నరసింహ, సంపత్ కుమార్, నాయకులు శంకర్ నాయక్ ,విజయ్ కుమార్, నరసింహ, నరేందర్ రెడ్డి, ఉస్మాన్, సత్యనారాయణ గౌడ్, బంగారు, బిర్లా మల్లయ్య, రామ్ గౌడు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -