నవతెలంగాణ – నెల్లికుదురు
ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహించే వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకొని మద్దతు ధరకు రేటు పొందాలని తహసిల్దార్ చంద నరేష్ ఏపిఎం నరేంద్ర కుమార్ తెలిపారు. శనివారం రామన్నగూడెం కాచికల్ ఐకెపి సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామన్నగూడెం క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన సమ్మక్క సారక్క కొనుగోలు కేంద్రం, మరియు కాచికల్ గ్రామంలో సాయిరాం గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రతి రైతు సద్విని చేసుకోవాలని తెలిపారు. రైతులు దళారుల చేతిలో మోసపోవద్దు అనే ఉద్దేశంతో ప్రభుత్వం వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రవేశపెట్టిందని అన్నారు. రైతులు కష్టపడి పండించిన పంటకు మధు ధర లభించాలంటే అది కేవలం కొనుగోలు కేంద్రాలు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఇట్టే దేవేందర్ రెడ్డి, ఆశిరెడ్డి, సీసీలు సోమయ్య, పుల్లయ్య, వెంకన్న, ఆ సెంటర్ నిర్వాహకులు బండి మంజుల, గాండ్ల విజయ ,ఉమా, శారద, వెంకన్న, గడ్డం రాధిక ఎడపాక వెంకటమ్మ అశోక్ రైతులు హమాలీలు పాల్గొన్నారు.
వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి: తహశీల్దార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



