– జిల్లా తెలంగాణ వ్యవసాయ అధికారులు సంఘం అధ్యక్షులు రాంబాబు
నవతెలంగాణ ఆర్మూర్
ఏషియన్ పీజీపీఆర్ సొసైటీ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, తెలంగాణ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ ఏటా ‘రైతు రత్న అవార్డు`లు అందజేయనున్నట్టు ప్రకటించింది. ఈ సందర్బంగా జిల్లా తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షులు రాంబాబు శనివారం మాట్లాడుతూ సుస్థిర, సేంద్రీయ, వినూతన వ్యవసాయ విధానాలను అనుసరించి విశిష్ట సేవలు అందిస్తున్న రైతులు, మహిళా రైతులను ఈ అవార్డుల ద్వారా సత్కరించనున్నారు అని అన్నారు.
మహా కిసాన్ మేళా సందర్భంగా డిసెంబర్ 3–4 తేదీల్లో హైదరాబాద్‌లోని అవార్డులు ప్రధానం చేయబడతాయి అని. రైతుల ఎంపికను తెలంగాణ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అసోసియేషన్ నిర్వహించనుంది అని తెలిపారు.అర్హులైన రైతులు తమ దరఖాస్తులను సంబంధిత మండల వ్యవసాయ అధికారులకు లేదా నిజామాబాదు జిల్లా తెలంగాణ వ్యవసాయ అధికారులక సంఘ ప్రతినిధులకు ఈ నెల 20 లోగా సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాలకు రాష్ట్ర నాయకులు మహేందర్ 8977752450, జిల్లా అధ్యక్షులు రాంబాబు 8977752269 ,కార్యదర్శి నర్సయ్య 8977752449 , సభ్యులు, సాయి కృష్ణ 8977752386, వైష్ణవ్ 8977752406 సంప్రదిచాలని కోరారు.



