నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలో పలువురు ఆత్మీయులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం పరామర్శించారు. బషీరాబాద్ గ్రామానికి చెందిన నర్రా మోహన్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారిని, వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. గ్రామానికే చెందిన నెల్ల రమేష్ తండ్రి ఇటీవల కాలం చేయడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కోనాపూర్ గ్రామానికి చెందిన సింగిల్ విండో చైర్మన్ బడాల రమేష్ రెడ్డి మామ అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుల అనారోగ్యాలకు గల కారణాలను వారి వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన వెంట బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బద్దం చిన్నారెడ్డి, రాజా గౌడ్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మలావత్ ప్రకాష్, నాయకులు ఏనుగు గంగారెడ్డి, తదితరులు ఉన్నారు.
ఆత్మీయులను పరామర్శించిన ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



