- Advertisement -
– విద్యార్ధులకు వ్రాత సామాగ్రి అందించిన ఉపాధ్యాయురాలు రేణుక
నవతెలంగాణ – అశ్వారావుపేట
గిరిజన తెగ నాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు బిర్సా ముండా 150 వ జయంతి ని శనివారం మండలంలోని ఎంపీయూపీఎస్ – పీఎం శ్రీ నారంవారిగూడెంలో ఘనంగా నిర్వహించారు. ప్రధనోపాద్యాయులు చంద్రశేఖర్ అద్యక్షతన నిర్వహించిన “జన జాతీయ గౌరవ దివస్” లో పాఠశాల గణిత బోధనా ఉపాధ్యాయిని రేణుక విద్యార్ధుల చేతి వ్రాత మెరుగు పరచడానికి రూ.3 వేల విలువైన వ్రాత పుస్తకాలను వితరణ చేశారు. శనివారం ఏకాదశి పర్వదినం కావడంతో విద్యార్ధులకు రుచికరం స్వంత ఖర్చుతో పరమాన్నం చేయించి వడ్డించారు.ఉపాద్యాయిని రేణుక కు పాఠశాల సిబ్బంది ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -



