నవతెలంగాణ-హైదరాబాద్ : క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది. డిసెంబరు 15న అబుదాబిలో మినీ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో రిటైన్, రిలీజ్ చేసే ఆటగాళ్ల వివరాలను ఫ్రాంఛైజీలు ప్రకటించాయి.
రిలీజ్ చేసింది వీరినే
సీఎస్కే: మతిశా పతిరన, రాహుల్ త్రిపాఠి, వన్ష్ బేడి, ఆండ్రీ సిద్ధార్థ్, రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, విజయ్ శంకర్, షేక్ రషీద్, కమలేశ్ నగార్‌కోటి.
ముంబయి: సత్యనారాయణ రాజు, రీస్ టాప్లీ, కేఎల్ షీర్జిత్, కర్ణ్ శర్మ, బెవాన్ జాకబ్స్, ముజీబుర్ రెహ్మన్, లిజాడ్ విలియమ్స్, విజ్ఞేశ్ పుతుర్.
పంజాబ్: జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హర్డీ, కుల్‌దీప్ సేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ప్రవీణ్ దూబె.
ఆర్సీబీ: స్వస్తిక్ చీకారా, మయాంక్ అగర్వాల్, టిమ్ సిఫర్ట్, లియామ్ లివింగ్‌స్టన్, మనోజ్ భాడ్గే, లుంగి ఎంగిడి, ముజారబానీ, మోహిత్ రాథీ.
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభినవ్ మనోహర్, అథ్వర తైడే, సచిన్ బేబీ, వియాన్ ముల్డర్, సిమర్‌జిత్ సింగ్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా.
ఢిల్లీ: డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్, సెథిఖుల్లా అటల్, మన్వంత్ కుమార్, దర్శన్ నల్కండే, మోహిత్ శర్మ.
గుజరాత్ టైటాన్స్: మహిపాల్ లామ్రోర్, కరీమ్ జనత్, డాసున్ శనక, గెరాల్డ్ కొయెట్జీ, కుల్వంత్ కుజ్రోలియా
లఖ్‌నవూ: ఆర్యన్ జుయల్, డేవిడ్ మిల్లర్, యువరాజ్ చౌదరి, రాజ్యవర్ధన్ హంగర్గేకర్, ఆకాశ్ దీప్, రవి బిష్ణోయ్, షమర్ జోసెఫ్.
రాజస్థాన్: వానిందు హసరంగ, మహీశ్ తీక్షణ, ఫజల్ హక్ ఫారూఖీ, ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తికేయ, కునాల్ రాథోడ్, అశోక్ శర్మ.
కోల్‌కతా: ఆండ్రీ రస్సెల్, వెంకటేశ్ అయ్యర్, క్వింటన్ డికాక్, ఆన్రిచ్ నోకియా, మొయిన్ అలీ, స్పెన్సన్ జాన్సన్, లువినిత్ సిసోడియా, చేతన్ సకారియా, రహ్మనుల్లా గుర్బాజ్.
ఇక, రవీంద్ర జడేజా (రూ.14 కోట్లు,) సామ్ కరన్ (రూ.2.4 కోట్లు) సీఎస్కే నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు, మహ్మద్ షమీ (రూ.10 కోట్లు) సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (రూ.2.6 కోట్లు) గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబయి ఇండియన్స్‌కు, నితీశ్ రాణా (రూ.4.2 కోట్లు) రాజస్థాన్ నుంచి దిల్లీ క్యాపిటల్స్‌కు, శార్దూల్ ఠాకూర్ (రూ.2 కోట్లు) లఖ్‌నవూ నుంచి ముంబయికి, డొనావన్ ఫెరీరా (రూ.కోటి) దిల్లీ నుంచి రాజస్థాన్‌కు, మయాంక్ మార్కండే (రూ.30 లక్షలు) కోల్‌కతా నుంచి ముంబయికి, అర్జున్ తెందూల్కర్ (రూ.30 లక్షలు) ముంబయి నుంచి లఖ్‌నవూకు ట్రేడ్ అయిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్..ఏ జట్టు ఎవరిని రిలీజ్ చేసిందంటే?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



