Saturday, November 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు

ఘనంగా బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామంలో శనివారం సీపీఐ(ఎం) కార్యాలయంలో  ఆదివాసి హక్కుల కోసం అప్రతిహతంగా పోరాడి, బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమ జ్వాలను రగిలించిన మహాయోధుడు బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ములుగు జిల్లా కమిటీ సమావేశం రత్నం రాజేందర్ అధ్యక్షతన కార్యక్రమం జరగగా, పార్టీ కార్యాలయంలో బిర్సా ముండా  జయంతి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ మాట్లాడుతూ..“ఆదివాసీల భూములు, అరణ్యాలు, జీవన విధానాలను కాపాడేందుకు బిర్సా ముండా చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. బ్రిటిష్ దోపిడీకి వ్యతిరేకంగా, ఆదివాసీ గిరిజన సమాజానికి స్వాభిమానం, స్వాతంత్ర్య స్ఫూర్తి నింపిన నాయకుడు ఆయన” అని పేర్కొన్నారు. ఆదివాసీలు ఎదుర్కొంటున్న   అటవీ హక్కులు, భూముల రక్షణ, వనరుల వినియోగంపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. బిర్సా ముండా చూపిన దారి నేటి పరిస్థితుల్లో మరింత అవసరమైందని, ఆయన ఆలోచనలు కొత్త తరానికి ప్రేరణగా నిలుస్తాయని అన్నారు.

కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి బి.రెడ్డి సాంబశివ, కార్యదర్శి వర్గ సభ్యులు కొప్పుల రఘుపతి, జ్ఞానం వాసు, చిట్టిబాబు, జిల్లా కమిటీ సభ్యులు సోమ మల్లారెడ్డి, కట్ల బ్రహ్మచారి, రత్నం ప్రవీణ్, తీగల ఆగి రెడ్డి, టి.ఎల్. రవి, జజ్జరి దామోదర్, దుగ్గి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -