Saturday, November 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలి

మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలి

- Advertisement -

– దిశా కమిటీ జిల్లా సభ్యులు బాగన్నగారి రవీందర్ రెడ్డి
నవతెలంగాణ- రాయపోల్
: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని, నాణ్యత లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దిశా కమిటీ జిల్లా సభ్యులు బాగన్నగారి రవీందర్ రెడ్డి అన్నారు. శనివారం రాయపోల్ మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కేజీవీబీ పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నిర్ణయించింది. కాబట్టి నిర్వాహకులు భోజనం నాణ్యత లేకుండా విద్యార్థులకు అందించవద్దన్నారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆహార భద్రత కమిటీలు ఏర్పాటు చేసుకొని భోజనం పరిశీలించిన తర్వాతనే విద్యార్థులకు భోజనం పెట్టాలన్నారు. వంటగది చుట్టూ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నాణ్యమైన పౌష్టికాహార భోజనం విద్యార్థులకు అందించి, విద్యార్థులు ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. అనంతరం పదవ తరగతి పరీక్షల షెడ్యూలు వెలువడిందని సమయం వృధా చేయకుండా అన్ని సబ్జెక్టులు పూర్తిస్థాయిలో ప్రణాళికబద్ధంగా చదువుతూ ఏదైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయుల చేత నివృత్తి చేసుకోవాలని పాఠశాల నుంచి అధిక సంఖ్యలో త్రిబుల్ ఐటీకి ఎంపిక కావాలని పదవ తరగతి విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -