శీతాకాలంలోకి అడుగుపెట్టాం. ఇప్పటికే వాతావరణం చల్లగా మారింది. చలికాలం చర్మానికి పెద్ద సవాలుగా ఉంటుంది. ఈ సీజన్‌లో చర్మ సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. ముఖ్యంగా చర్మం పొడిబారుతుంది. దురద, మొటిమలు లాంటి సమస్యలు పెరుగుతాయి. అయితే, కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం వల్ల శీతాకాలంలో చర్మానికి రక్షణ కలుగుతుంది. చర్మ సమస్యలు తగ్గేందుకు ఈ టిప్స్ తోడ్పడతాయి. అవేంటంటే..
సరైన మాయిశ్చరైజర్స్
చలికాలంలో అతిపెద్ద ప్రాబ్లం చర్మం పొడిబారడం. అందుకే చర్మం హైడ్రేటెడ్‌గా ఉండేలా మాయిశ్చరైజర్స్ వాడాలి. ఇవి పూసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఆయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్లు, లోషన్లు వాడాలి. ఇవి చర్మంపై రక్షణ పొరను ఏర్పాటు చేసి తేమను చేస్తాయి. పొడిబారే సమస్యను తగ్గిస్తాయి.
హీటర్ వాడితే ఈ జాగ్రత్తలు
చలికాలంలో వెచ్చగా అనిపించాలని ఇళ్లలో రూమ్ హీటర్లు వాడకం ఇటీవల ఎక్కువ అయింది. అయితే, వీటి ప్రభావం చర్మంపై కూడా ఉంటుంది. అందుకే టెంపరేచర్ అవసరానికి మించి ఎక్కువగా పెట్టుకోకూడదు.
నీరు తగినంత తాగాల్సిందే
చలికాలమైనా అందరూ నీరు తగినంత తాగాల్సిందే. వాతావరణం చల్లగా ఉన్న కారణంగా చాలా మంది నీటిని ఎక్కువగా తీసుకోరు. ఇది కూడా చర్మానికి చేటు చేస్తుంది. నీరు తక్కువగా తాగితే చర్మంలో తేమ నిలువకుండా పొడిగా మారుతుంది. అందుకే చర్మం బాగుండాలంటే చలికాలంలోనూ తగినంత నీరు తాగాల్సిందే.
ఈ పోషకాలు ఉండే ఆహారం
చలికాలంలో పోషకాహారం తీసుకోవడం వల్ల కూడా చర్మానికి రక్షణ కలుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే ఆహారాలు ఈ కాలంలో తినాలి. వాటిలోని పోషకాలు చర్మానికి మేలు చేసి, మెరుపుతో ఉండేలా తోడ్పడతాయి.
చలికాలంలో చర్మం బాగుండాలంటే..
- Advertisement -
- Advertisement -



