అలా అనుకున్నాను
శ్రీకాంత్ : నా యాభై రూపాయలు పోయాయిరా.
అవేజ్ : యాభై రూపాయల నోటు పోయిందా, చిల్లర పోయిందా?
శ్రీకాంత్ : చిల్లరే. రెండు 20 రూపాయల నోట్లు, ఒక 10 రూపాయల నోటు.
అవేజ్ : నాకయితే 50 రూపాయల నోటు దొరికింది.
శ్రీకాంత్ : అది నాదేరా.
అవేజ్ : ఇందాక చిల్లర పోయిందన్నావుగా?
శ్రీకాంత్ : ఎవరికైనా చిల్లర అవసరమై ఉంటుంది. నా యాభై రూపాయల చిల్లర తీసుకుని, నోటు అక్కడ పెట్టి ఉంటారు.
ఉడికిన గుడ్లు
కొడుకు : కోడి గుడ్డు పెట్టడానికి వస్తుంది నాన్నా. కోడిని వేడి నీళ్ళలో పెట్టనా.
తండ్రి : వేడి నీళ్ళలో ఎందుకురా?
కొడుకు : వేడినీళ్లలో పెడితే మనం గుడ్డు ఉడకపెట్టుకోకుండా అదే ఉడికించిన గుడ్డు పెడుతుందని.
పిసినారి
శ్రీకాంత్ : గంగాధర్! లక్ష్మణ్‌ని హాస్పటల్ తీసుకెళ్దాంగానీ తొందరగా ఆబులెన్స్‌కి ఫోన్ చెయ్యి.
గంగాధర్ : ఇప్పుడే మిస్డ్ కాల్ ఇచ్చాను.
శ్రీకాంత్ : అది టోల్ ఫ్రీ నెంబర్ కదా. మిస్డ్ కాల్ ఇవ్వడం ఏంటి?
గంగాధర్ : ఆ సంగతి నాకూ తెలుసు. కానీ నా సెల్‌లో చార్జింగ్ వేస్ట్ అవుతుందని.
కడగబోతున్నాను
గంగాధర్ : ఈ రోజు నేను ఓ గొప్ప పని చేశాను. ఇంకోటి చేయబోతున్నాను.
రాంబాబు : ముందు ఏం గొప్ప పని చేశావో చెప్పు?
గంగాధర్ : కొత్త సెల్‌ఫోన్‌కి బాగా దుమ్ము పట్టిందని శుభ్రంగా కడిగి ఆరబెట్టాను.
రాంబాబు : (కంగారుగా) మరి చేయబోయే పనేంటి?
గంగాధర్ : టీవీని కూడా కడగబోతున్నాను.
పేరేంటో…
అజయ్ : ఏడుస్తూ ఏడిపించేవాడ్ని నిరాశావాది అంటారు. మరి నవ్వుతూ నవ్వించేవాడిని ఏమంటారు?
విజయ్ : జోకిస్ట్ అంటారు.
షాక్
గోపాల్ : ఏ సినిమా ప్రకటనకు ప్రేక్షకులు షాకవుతారు?
కృష్ణ : మా సినిమా హాల్లో దోమలు కరిచినందువల్ల డెంగ్యూ వస్తే అది మా బాధ్యత కాదు అన్న ప్రకటన చూసినప్పుడు.
ప్రత్యామ్నాయం
తల్లి : ఏరా కుక్కపిల్లకు అన్నం పెట్టావా?
కొడుకు : పెడదామనుకున్నా కానీ, అన్నంలేదు. అందుకే పది రూపాయలిచ్చి ఏదైనా కొనుక్కొని తినమన్నాను.
ఎవరో కొట్టేశారు…!
ఇన్విజిలేటర్ : పరీక్ష రాయకుండా ఏడుస్తున్నావేమిటి బాబు?
వంశీ : నేను కష్టపడి రాసి తెచ్చుకున్న స్లిప్పులు ఎవరో కొట్టేశారు సార్.
నవ్వుల్ పువ్వుల్
- Advertisement -
- Advertisement -



