Sunday, November 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరేపటి నుంచి ఐసీఎల్‌ ఫిన్‌కార్ప్‌ కొత్త ఎన్‌సీడీ ఇష్యూ

రేపటి నుంచి ఐసీఎల్‌ ఫిన్‌కార్ప్‌ కొత్త ఎన్‌సీడీ ఇష్యూ

- Advertisement -

హైదరాబాద్‌: సెక్యూర్డ్‌ రిడీమబుల్‌ నాన్‌ కన్వర్టేబుల్‌ డిబెంచర్స్‌ (ఎన్‌సీడీ) ఇష్యూను జారీ చేస్తోన్నట్టు ఐసీఎల్‌ ఫిన్‌కార్ప్‌ తెలిపింది. ఈ ఇష్యూ నవంబర్‌ 17న తెరువబడి.. 28 వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఇందులో పెట్టుబడులపై ఏడాదికి గరిష్టంగా 12.62 శాతం వరకు రాబడిని అందించనున్నట్టు ఆ సంస్థ సీఎండ కేజీ అనిల్‌ కుమార్‌ తెలిపారు. ఈ ఎన్‌సీడీకి క్రిసిల్‌ బిబిబిమైనస్‌ స్టేబుల్‌ రేటింగ్‌ ఉందన్నారు. ఈ ఎన్‌సీడీలను 13, 24, 36, 60, 70 నెలల కాలపరిమితితో విడుదల చేస్తున్నామన్నారు. వార్షిక వడ్డీ రేటు 10.50 శాతం 12.62 శాతంగా ఉంటుందన్నారు. కనీస దరఖాస్తు రూ.10,000 నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఈ ఇష్యూ నిధులను ఐసీఎల్‌ ఫిన్‌కార్ప్‌ వృద్ధికి మద్దతునిచ్చే కార్యక్రమాలకు ఉపయోగించనున్నామన్నారు. వినియోగదారులు, వాటాదారుల సేవల నాణ్యతను పెంచనున్నామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -