Sunday, November 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంలారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

- Advertisement -

పలువురికి గాయాలు
నవతెలంగాణ-మానకొండూర్‌
ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. శనివారం కరంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలంలోని సదాశివపల్లి బస్టాప్‌ సమీపంలో నిజామాబాద్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలయ్యాయి. బస్సు అద్దాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సంజీవ్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -