Sunday, November 16, 2025
E-PAPER
Homeజాతీయంఎన్ కౌంటర్..ముగ్గురు మావోయిస్టులు మృతి

ఎన్ కౌంటర్..ముగ్గురు మావోయిస్టులు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌ అడవులు ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా దద్దరిల్లాయి. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకోగా ఆ ప్రాంతం మొత్తం తుపాకుల శబ్ధంతో రణరంగంగా మారింది. సుక్మా జిల్లా చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని కరి గుండం అటవీ ప్రాంతంలో జిరగినో ఈ ఎన్ కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కాగా ఈ ఎన్ కౌంటర్ కొనసాగుతుండగా మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్ కౌంటర్ సందర్భంగా పోలీసులు ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -