Sunday, November 16, 2025
E-PAPER
Homeతాజా వార్తలుట్రావెల్స్ బస్సులో మంటలు..

ట్రావెల్స్ బస్సులో మంటలు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని కీసర టోల్‌ గేట్ వద్ద పెను ప్రమాదం తప్పింది. దాసరి ట్రావెల్స్‌కు చెందిన బస్సులో మంటలు చెలరేగగా.. టోల్‌గేట్‌ సిబ్బంది అప్రమత్తతతో పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, హైదరాబాద్ నుంచి ప్రయాణిస్తున్న ఈ బస్సు కీసర టోల్‌గేట్‌ను దాటే సమయంలో, బస్సు టైర్ల దగ్గర పొగలు రావడాన్ని టోల్ సిబ్బంది ముందుగా గుర్తించారు. ఎయిర్ పైప్ లీక్ కావడంతో టైర్లు హీట్‌ ఎక్కి, మంటలు అంటుకునే పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. వెంటనే బస్సును నిలిపివేసి డ్రైవర్‌కు టోల్ సిబ్బంది సమాచారం ఇచ్చి ప్రమాద తీవ్రతను తగ్గించారు.

కాగా, ఈ ఘటన సమయంలో టోల్‌గేట్ దగ్గర డ్యూటీలో ఉన్న కంచికచర్ల ఎస్ఐ విశ్వనాథ్, పోలీస్ వాహనంలో నిద్రపోతూ ఉండటం స్థానికంగా చర్చగా మారింది. ప్రమాదం జరిగినట్టు తెలిసినా, ఎస్ఐ స్పందించకపోవడం విమర్శలకు దారితీసింది. అయితే, బస్సులో ప్రయాణిస్తున్న వారిని మరో బస్సులోకి తరలించారు. అప్రమత్తమైన టోల్‌గేట్ సిబ్బంది తక్షణ చర్యలు తీసుకుని ప్రాణాపాయాన్ని తప్పించడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక, బస్సు టోల్ గేట్ వద్ద ఆగి ఉండకపోతే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం జరిగేది అని పేర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -