Sunday, November 16, 2025
E-PAPER
Homeజాతీయంఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జోధ్‌పూర్‌-జైసల్మేర్‌ జాతీయ రహదారిపై రామ్‌దేవ్రాకు భక్తులతో వెళ్తున్న టెంపోను బాలేసర్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రాంతంలో ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మహిళలు, పిల్లలు సహా 14 మందికి తీవ్ర గాయ‌లైయ్యాయి. బాధితుల‌ను జోధ్‌పూర్‌లోని ఎండీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా గుజరాత్‌లోని సబర్కాంత జిల్లా వాసులుగా అధికారులు గుర్తించారు. మిల్లెట్ లోడ్‌తో వెళ్తున్న టక్రు వేగంగా వెళ్తూ నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న టెంపోను ఢీకొట్టిందని బాలేసర్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జి మూల్‌ సింగ్‌ భాటి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -