Sunday, November 16, 2025
E-PAPER
Homeఆటలుసౌతాఫ్రికా చేతిలో భారత్ ఘోర ఓటమి

సౌతాఫ్రికా చేతిలో భారత్ ఘోర ఓటమి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా 93 పరుగులకు పరిమితమైంది. వాషింగ్టన్ సుందర్ (31), అక్షర్ పటేల్ (26), రవీంద్ర జడేజా (18), ధ్రువ్ జురెల్ (13) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ మెడ నొప్పి కారణంగా మైదానాన్ని వీడిన శుభ్‌మన్ గిల్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్‌కు రాలేదు. సైమన్ హర్మర్ (4/21), మార్కో యాన్సెన్ (2/15), కేశవ్ మహరాజ్ (2/37) టీమ్ఇండియా పతనాన్ని శాసించారు. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 159, సెకండ్ ఇన్నింగ్స్‌లో 153 పరుగులు చేసింది. టీమ్‌ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 189, రెండో ఇన్నింగ్స్‌లో 93 రన్స్ చేసింది. సౌతాఫ్రికా 15 ఏళ్ల తర్వాత భారత్‌లో టెస్టు మ్యాచ్ గెలవడం విశేషం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -