సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వరి పల్లి వెంకన్న
నవతెలంగాణ- నెల్లికుదురు
ఖమ్మంలో జరిగే సిపిఐ పార్టీ 100 సంవత్సరాల ముగింపు సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే బస్సు జాతను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వారి పల్లి వెంకన్న కోరినట్లు తెలిపారు. మండల కేంద్రంలో ఆదివారం సంబంధిత కరపత్రావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత గడ్డపై సిపిఐ పార్టీ 100 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం పట్టణంలో పట్టణ కేంద్రంలో డిసెంబర్ 26వ తేదీన భారీ బహిరంగ సభను జరుగుతున్నందున లక్షలాదిమంది హాజరై ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరినట్టు తెలిపారు. ఈ సభకు 40 దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి తుటి వెంకటరెడ్డి, చిర్ర సత్యనారాయణ, కొట్టే లక్ష్మి ,గుంటూరు పద్మ ,వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నవంబర్ 20న బస్సు జాతను జయప్రదం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



