Sunday, November 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్షార్ట్ సర్క్యూట్ తో ఎలక్ట్రికల్ వర్క్ షాప్ దగ్దం.. రూ.10 లక్షల ఆస్తి నష్టం

షార్ట్ సర్క్యూట్ తో ఎలక్ట్రికల్ వర్క్ షాప్ దగ్దం.. రూ.10 లక్షల ఆస్తి నష్టం

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు 
మండల కేంద్రంలోని శ్రీరామ బాలాజీ ఇంజనీరింగ్ ఎలక్ట్రిషన్ వర్క్ షాప్ లో ఆదివారం ప్రమాదవశాత్తూ షార్ట్ సర్క్యూడ్ జరిగింది. దీంతో షాప్ లోని వస్తువులన్నీ కాలిపోయాయని షాప్ నిర్వహకుడు బుద్ధ నగేష్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలక్ట్రిషన్ మోటార్ పైపులు, ప్లాస్టిక్ వస్తువులు, వివిధ రాకాల వైర్లు మొదలగు వస్తువులు కాలి బూడిదైపోయాయని ఆయన వాపోయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించానని తెలిపారు. అయినా ఫలితం లేదని, అంతలోనే అంతా అగ్నికి ఆహుతి అయ్యిందని అన్నారు. ఈ ప్రమాదంతో రూ. 10 లక్షల నష్టం జరిగిందని ఆయన ఆవేదన చెందారు. షాపుపైనే ఆధారపడి జీవిస్తున్న మా కుటుంబం ఈ ఘటనతో రోడ్డున పడే పరిస్థితి నెలకొన్నదని అన్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి నన్ను ఆదుకోవాలని కోరినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -