Sunday, November 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇప్పలగూడెంలో సీసీ రోడ్ల పనులు ప్రారంభం..

ఇప్పలగూడెంలో సీసీ రోడ్ల పనులు ప్రారంభం..

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం గ్రామపంచాయతీ పరిధిలోని ఇప్పలగూడెంలో సీఆర్ఆర్ నిధుల ద్వారా రూ.10 లక్షల తో సీసీ రోడ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా భూపాలపల్లి జిల్లా గ్రంధాలయం చైర్మన్ కోట రాజబాపు మాట్లాడుతూ.. ఈ నిధులను కేటాయించినందుకు గౌరవ మంత్రి శ్రీధర్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాటారం సబ్ డివిజన్ పరిధిలో అభివృద్ది పనులకు మంత్రి తనవంతు సహకారం అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం ఏఎంసీ చైర్ పర్సన్ పంతకాని తీర్మాల సమ్మయ్య, వైస్ చైర్మన్ చినాలా బ్రహ్మరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేమూనూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, మాజీ ఎంపీటీసీ జాడి మహేశ్వరి, చీమల రాజు, జాడి రమేష్, ఆత్మకూరి కుమార్ యాదవ్, బొడ్డు రాజశేఖర్, డోంగిరి రవి, డోంగిరి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -