- Advertisement -
నవతెలంగాణ – కాటారం
మండల పరిధిలోని మద్దులపల్లి ఎల్జీ గార్డెన్ లో ఆదివారం చీర్ల తిరుపతి రెడ్డి పుత్రుడు రాజశేఖర్ రెడ్డి – శ్రీజరెడ్డిల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకల్ పాల్గొన్నారు. ఈ క్రమంలో నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. దంపతులిద్దరరూ ఆయూరారోగ్యాలతో, కలకాలం అన్యోన్యంగా జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట జక్కు రాకేష్, రామిళ్ళ కిరణ్,తోట జనార్ధన్, ఊర వెంకటేశ్వరరావు, పంతకని సడవలి, బుర్ర లక్ష్మణ్, జక్కు శ్రావణ్, మంతెన చిరంజీవి, బాలరాజు, ఉప్పు సంతోష్, గాజుల విక్రం, కామెడీ ప్రమోద్, దుర్గారావు, అజ్మీర దేవా తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



