నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ఆదివారం స్థానిక బస్టాండ్ ఏరియాలో ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు, వాహనదారులకు డిఫెన్సివ్ డ్రైవింగ్ పై అవగాహన కల్పించారు. రోడ్డు పై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పరిసరాలను ముందుగానే గమనిస్తూ డ్రైవింగ్ చేయాలని ఎస్ఐ సూచించారు. డిఫెన్స్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. ఎదుటివారి తప్పిదాలను తప్పనిసరిగా డ్రైవింగ్ చేసేటప్పుడు గమనించాలన్నారు.దీంతో ప్రమాదల నుండి రక్షించుకోవచ్చన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డిఫిన్సి డ్రైవింగ్ పై ప్రతి ఒక్క డ్రైవర్ కు అవగాహన కల్పిస్తామన్నారు. ఈ పద్ధతిని వాహనదారులు తప్పనిసరిగా పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అని అన్నారు. ఈకార్యక్రమంలో పోలిస్ సిబ్బంది,ఆటో డ్రైవర్ లు, తదితరులు పాల్గొన్నారు.
ముధోల్ లో డిఫెన్సివ్ డ్రైవింగ్ పై అవగాహన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



