Monday, November 17, 2025
E-PAPER
Homeతాజా వార్తలుభారతీయులంతా గర్వపడతారు

భారతీయులంతా గర్వపడతారు

- Advertisement -

మహేష్‌ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘వారణాసి’. శ్రీ దుర్గా ఆర్ట్స్‌, షోయింగ్‌ బిజినెస్‌ బ్యానర్లపై కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ నిర్మిస్తున్నారు. పథ్వీరాజ్‌ సుకుమారన్‌, ప్రియాంక చోప్రా కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. గ్లోబ్‌ ట్రాటర్‌ అంటూ గ్రాండ్‌ ఈవెంట్‌ నిర్వహించిన చిత్రయూనిట్‌ ఈ కార్యక్రమంలోనే టైటిల్‌ను, హీరో ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను, సినిమా స్థాయిని చాటేలా టీజర్‌(వారణాసి టు ది వరల్డ్‌)ను కూడా రిలీజ్‌ చేశారు.

మహేష్‌ బాబు మాట్లాడుతూ, ‘మా నాన్న (కృష్ణ) చెెప్పిన ప్రతీ మాటను నేను విన్నాను. ఒక్క మాట తప్పా. పౌరాణిక పాత్రలు పోషించమని చెప్పిన మాటను మాత్రం నేను వినలేదు. ఈ చిత్రంతో ఆ కోరిక కూడా నెరవేరింది. ‘వారణాసి’ నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. ఇలాంటి అవకాశం జీవితంలో ఒకసారి మాత్రమే వస్తుంది. అందరినీ గర్వపడేలా చేస్తాను. ఈ చిత్రం రిలీజ్‌ అయినప్పుడు మన భారతీయులంతా గర్వపడతారు. ఇది కేవలం టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ మాత్రమే. ముందు ముందు ఎలా ఉండబోతోందో మీ (అభిమానులు) ఊహకే వదిలేస్తున్నాను’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -