నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఫతేనగర్‌లో రెండు వేర్వేరు కేసుల్లో ఎక్సైజ్ పోలీసులు 2.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం స్ట్రాటజిక్ టాస్క్‌ఫోర్స్ ఆన్ ఆల్కహాల్ (ఎస్టీఎఫ్ఏ) బృందం, బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్ అధికారులు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. 9 మంది వ్యక్తులపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. మొదటి కేసులో నిందితుల నుంచి 1.2 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురిపై కేసులు నమోదు చేశారు. పార్థీవాడకు చెందిన కే రాఖీదేవి (28), కలివాలా నన్న ఏ సుదర్శన్‌ని అరెస్టు చేశారు.కలివాల వరలక్ష్మి ఏ వరమ్మ, కలివాలా అజ్లి, ఎస్లి కవిత అనే నిందితులు పరారీలో ఉన్నారు. మరో కేసులో నిందితుల నుంచి 1.054 కిలోల డ్రై గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. పార్ధీవాడకు చెందిన శక్తి రోజా, శక్తి మల్లికార్జున్లను ఆరెస్టుచేశారు. అదే ప్రాంతానికి చెందిన శక్తి భూమిక, శక్తి రూపేష్ ,ఏ విఘ్నేష్కుమార్లు పరారీలో ఉన్నారు. నిందితులు ఒడిశాలోని తెలియని వ్యక్తి నుంచి ఎండు గంజాయిని కొనుగోలు చేసి చిన్న చిన్న పొట్లాలు తయారు చేసి ఫతేనగర్ సమీపంలో విక్రయిస్తున్నారని తెలిపారు. కేసు తదుపరి విచారణ కోసం బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్ పోలీసులు చేస్తున్నారు.
ఫతేనగర్‌లో 2.2కిలోల గంజాయి స్వాధీనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



