Monday, November 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులను ఆదుకోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు..

రైతులను ఆదుకోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు..

- Advertisement -

తెలంగాణ రైతు పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్…దాసరి రమేష్
నవతెలంగాణ – మల్హర్ రావు

సాగు ప్రారంభం నుంచి రైతులు వేసిన పత్తి, వరి పంటలకు సకాలంలో యూరియా అందక, పెరిగిన ఎరువుల ధరలు, పంటలు నోటికొచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిని పెట్టుబడులు రాని పరిస్థితి ఉంటే నష్టపరిహారం ఇవ్వాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడం లేదని తెలంగాణ రైతు పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ దాసరి రమేష్ ఆరోపించారు. సోమవారం మండల కేంద్రమైన తాడిచెర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతే రాజు అనే మాట కాలం చెల్లిందని, అరుకాలం కష్టపడి దేశానికి అన్నం పెడుతున్న రైతులను ఆదుకోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు వడ్లు పత్తి కొనాలంటూ బతిమిలాడే పరిస్థితి తలెత్తుతుందన్నారు.

ఒకవైపు ప్రకృతి సహకరించపోవడం మరోవైపు అధికారులు మిల్లర్ల సమన్వయం లోపం కొనుగోలు కేంద్రాల వద్ద తాలు, తేమ తదితర కారణాలతో తిరస్కరించడం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి కొనుగోలు విషయంలో కేంద్ర  ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనలు రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయన్నారు.సాగు ప్రారంభం నుండి ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల సమస్యలు, దీనికి తోడుగా పెరిగిన ఎరువుల ధరలతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితన్నారు. కష్టపడి పండించిన పంటకు మార్కెట్ అమ్ముకుందామంటే తేమశాతం కారణంగా మద్దతు ధర రావడంలేదని, అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని నాణ్యత తగ్గి తేమ ఎక్కువగా ఉండడంతో కొనుగోలు కేంద్రాల్లో తిరస్కరించడంతో తక్కువ ధరలకు వ్యాపారులను ఆశ్రయిస్తున్నట్లుగా తెలిపారు. దుక్కి దున్నడం మొదలు పంట కోత వరకు మోకనైజేషన్ ఆధారపడక తప్పడం లేదని, ట్రాక్టర్లు యంత్రాల కిరాయిలు కూడా పెరిగి తడిసి మోపిడౌతున్నాయన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -