Monday, November 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామారెడ్డి ప్రజావాణికి 87 దరఖాస్తులు

కామారెడ్డి ప్రజావాణికి 87 దరఖాస్తులు

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కి 87 దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ అదనపు కలెక్టర్ లు విక్టర్, మదన్ మోహన్, డిప్యూటి ట్రైనీ కలెక్టర్ రవితేజ వివిధ మండలాల నుండి వచ్చిన దరఖాస్తుదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత అధికారులకు ఇస్తూ తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఆన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి లో ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్ల పథకం నకు సంబంధించి వివిధ రకాల సమస్యల పై అర్జీలను స్వీకరించి అర్జీ దారుని యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించి, ఇళ్ల నిర్మాణాలకు తగు చర్యలు తీసుకోవాలని ఆన్నారు.

ఆయా శాఖలకు సంబంధించిన దరఖాస్తులు విద్యా, వైద్యం, మిషిన్ భగీరథ, విద్యుత్, డి డబ్ల్యూ ఓ, ఆర్ టి సి, భూభారతి, రెవెన్యు కు సంబంధించిన వివిధ రకాల దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించి సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులకు అందించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ ఆయన తహసిల్దార్లతో మాట్లాడుతూ..  భూభారతీ, రెవెన్యు సదస్సులకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలని, అలాగే ఆయా మండలాల తహసీల్దార్లు వరి కొనుగోలు కేంద్రాలను ప్రతీ రోజు పర్యవేక్షించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజావాణి కి 87 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ ప్రజావాణిలో ఆయా శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు, రెవెన్యు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -