Monday, November 17, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమా సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నాం: ఐ-బొమ్మ

మా సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నాం: ఐ-బొమ్మ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కొత్త సినిమాలు, ఓటీటీ వేదికల్లోని కంటెంట్‌ను పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ఐ-బొమ్మ ప్రధాన నిందితుడు ఇమ్మడి రవి(40)ని ఎట్టకేలకు హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతన్ని నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపర్చగా.. రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. తాజాగా ఐ-బొమ్మ వెబ్‌సైట్ నుంచి అధికారికంగా ఓ మెసేజ్ రిలీజ్ చేశారు. ‘‘ఇటీవల జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. మొదటి నుంచి మాకు అనేకమంది విశ్వసనీయ అభిమానులు ఉన్నారు.. ఏదేమైనా, మా సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నాం.. మా సేవలను నిలిపివేస్తున్నందుకు చింతిస్తున్నాం.. అందుకు క్షమాపణలు కోరుతున్నాం’’ ఐ-బొమ్మ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -