– అక్రమ కేసులు బనాయిస్తే జనాలందరిని పోగుచేసి న్యాయం చేపిస్తా..
నవతెలంగాణ – జుక్కల్
నియోజకవర్గంలోని పలు మండలాలలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు యువకులపై చేస్తున్న అక్రమ కేసులను సంబంధించి మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాస్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 8 మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలకు ఎమ్మెల్యే తోట అక్రమ కేసులు బనాయిస్తూ జనాలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల జుక్కల్ మండలాలు, బిచ్కుంద మండలాలలో పలు నియోజన సంఘాలు యువకులు రోడ్ల విషయంలో సెంట్రల్ లైటింగ్ పెండింగ్లో పనులు ఉన్నాయని, రోడ్లు తవ్వేసి గుంతల మయంగా మారాయిని వాటికి సంబంధించి ఇటీవలే ధర్నా చేసినందుకు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావును ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి లోనైన ఎమ్మెల్యే నన్నే ప్రశ్నిస్తారా .. అని కక్ష్య సాధింపు చర్యలకు పూనుకున్నాడని ఆరోపించారు. అంతేకాకుండా ప్రజలపై, కార్యకర్తలపై అన్యాయంగా కేసులు బనాయించారని ఆయన ఆవేదన చెందారు.
ఇటీవల బిచ్కుంద మండల కేంద్రంలోని 11 మంది యువకులపై ధర్నా చేసిన యువకులపై బిచ్ కుండ పీస్ లో కేసు పెట్టారని తెలిపారు. అక్రమ కేసులు చేస్తున్న ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఇటువంటి సమస్యలను సమాధానం చెప్పలేకే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని షిండే ఆరోపించారు. వెంటనే బిచ్కుంద మండల కేంద్రంలో యువకులపై కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలతో మమేకమై, ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహించి న్యాయం జరిగే వరకు వదిలే ప్రసక్తే లేదని ఈ సందర్బంగా హెచ్చరించారు.



