- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత నిర్ణయంలో ఆలస్యంపై సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కార పిటిషన్‌పై స్పీకర్‌కు నోటీసులు జారీ చేసి, 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి ధర్మాసనం, మూడు నెలల్లో నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారమని వ్యాఖ్యానించి, రోజువారీ విచారణ జరిపి త్వరగా తీర్పు ఇవ్వాలని సూచించింది.
- Advertisement -


