Monday, November 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి..

కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి..

- Advertisement -

నవతెలంగాణ  – భువనగిరి
భువనగిరి పట్టణంలోని హౌజింగ్ బోర్డ్ కాలనీ 10వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండి ఇమ్రాన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం గల్లీలలో పైప్ లైన్ వేయడానికి తోవ్వడం జరిగింది. 10 రోజులు అవుతున్న నేటికి పనులు పూర్తి చేయలేదు. తవ్వి పైప్ లైన్ వేశారన్నారు.  మీకు ఇష్టముంటే పైప్ లైన్ కలుపుకోండి లేకుంటే లేదు అని చెప్పడంతో ఇంటి యజమానులు 3000 ఖర్చుపెట్టి పైప్ లైన్ డ్రైనేజీలో కలపడం జరిగిందన్నారు. తవ్వినప్పుడు మున్సిపల్ నల్ల పైపులు కూడా డ్యామేజ్ అవ్వడంతో ప్రతి ఇంటికి రూ.2000 ఖర్చుపెట్టి నల్ల కలెక్షన్లు సొంతంగానే తీసుకోవడం జరిగిందన్నారు. తవ్విన మట్టి తీయకపోగా  మ్యాన్ హోల్ పై కవర్ వేయకపోవడంతో విపరీతమైన దోమలు పెరిగిపోతున్నాయన్నారు. 

ఇంటి లోపలికి వెళ్లాలన్న వృద్ధులు చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారన్నారు. గల్లీలో చెత్త బండి రావడం లేదు త్రాగడానికి నీళ్లు సప్లై చేసే మినరల్ వాటర్ ఆటో రావడం లేదన్నారు.  వాహనాలు ఇంటి నుండి దూరంగా పెట్టి రావడం తో వాహనాలు పోతాయని భయం  ఉందన్నారు. హౌసింగ్ బోర్డ్ లో నిత్యం దొంగతనాలు జరుగుతూనే ఉంటాయన్నారు. దీనివల్ల గల్లీ వాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పనులలో ఆలసత్యం వహించి కాలనీవాసులను ఇబ్బందులకు గురిచేసిన  కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఇమ్రాన్ డిమాండ్ చేశారు. ఈవిషయాన్ని మున్సిపల్ కమిషనర్, జిల్లాకలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -