Tuesday, November 18, 2025
E-PAPER
Homeక్రైమ్విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్దం.. రూ.5 లక్షల ఆస్తినష్టం

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్దం.. రూ.5 లక్షల ఆస్తినష్టం

- Advertisement -

బాధితుడు భూక్య బాలాజీ 
నవతెలంగాణ – నెల్లికుదురు

మండలంలోని దుర్గాభవాని తండా గ్రామపంచాయతీ శివారు రామోజీ తండాకు చెందిన భూక్య బాలాజీ ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి దగ్దమైంది. వివరాల్లోకి వెలితే.. విద్యుత్తు స్తంభం పైన ఉన్న కరెంటు వైర్లు మంటలు ఏర్పడి విద్యుత్ స్తంభం నుండి నేరుగా మెయిన్ వైర్ తో ఇంట్లోకి వచ్చి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యిందని బాధితుడు భూక్య బాలాజీ తెలిపారు. ఈ ప్రమాదంతో ఇంట్లోని సామాన్లు బియ్యం, నగదు రూ.50 వేలు, వ్యవసాయం కోసం కొన్న మొక్కజొన్న ప్యాకెట్స్, టీవీ, బెడ్స్, బట్టలు, ఇతర సామాగ్రితో కలిపి సుమారు రూ.5 లక్షల విలువ గల వస్తువులు అన్నీ కాలి బూడిదైపోయాయని ఆయన వాపోయారు. ఈ ప్రమాదంతో ఉండటానికి ఇల్లు లేకుండా కష్టంగా మారిందని, తినడానికి తిండి, బియ్యం బస్తాలు కాలిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నానని ఆయన ఆవేదన చెందారు. కనీసం కట్టుకోవడానికి దుస్తులు కూడా లేకుండా కాలిపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని తెలిపారు. దీంతో నేనూ, నా కుటుంబం రోడ్డుపై పడాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రభుత్వం, అధికారులు స్పందించి నన్ను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -