Tuesday, November 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆత్మకూరులో ముదిరాజ్ మహాసభ గోడపత్రిక ఆవిష్కరణ

ఆత్మకూరులో ముదిరాజ్ మహాసభ గోడపత్రిక ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూర్ 
తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ ఆదేశాల మేరకు గ్రేటర్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బండి సారంగపాణి, గ్రేటర్ వరంగల్ నగర అధ్యక్షుడు బయ్య స్వామి ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆత్మకూర్ మండల కేంద్రంలోని ముదిరాజ్ బంధువులతో కలిసి గోడపత్రిక (వాల్ పోస్టర్) ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈనెల నవంబర్ 21న జరగనున్న తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామం, మండల, జిల్లా కేంద్రాలలో జెండా పండుగ నిర్వహించి జెండా ఎగురవేయాలని, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం చైర్మన్ గుండెబోయిన బిక్షపతి, బాబు భయ్య, భయ్య సుధాకర్, భయ్య రాజు (మాజీ ఎంపిటిసి), బయ్య భిక్షపతి, భాషబోయిన సాగర్, భాషబోయిన సదానందం, భాషబోయిన ఐలయ్య, గుండెబోయిన అశోక్, గుండెబోయిన శ్యామ్, భయ్య వినయ్, భయ్య కుమార్, భయ్య రవి, కుక్కల రఘుపతి, కుక్కల రమేష్, బోయిన సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -