Tuesday, November 18, 2025
E-PAPER
Homeమానవిఆర్ధిక స్వాలంబన అవ‌స‌రం

ఆర్ధిక స్వాలంబన అవ‌స‌రం

- Advertisement -

చదువుకున్న చాలా మంది ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. ఉదయం వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకోవచ్చని చాలా మంది మహిళలు ఉద్యోగం చేసేందుకు ఇష్టపడతారు. ఇందుకు భిన్నంగా కొందరు మాత్రం వ్యాపారంలో రాణించేందుకు కషి చేస్తున్నారు. తమ లాంటి మహిళలకు ఉపాధి కల్పించాలని తపిస్తుంటారు. అలాంటి వారిలో ఒకరు యామిని కోగంటి. మహిళలకు ఆర్ధిక స్వాలంబన అందించాలని, తన వంతుగా పర్యావరణాన్ని కాపాడాలని జగీష అప్పీరల్స్‌ పేరుతో పేపర్‌ కవర్లు తయారు చేసే వ్యాపారం ప్రారంభించిన ఆమె పరిచయం నేటి మానవిలో…..

యామిని కష్ణా జిల్లాలోని ఇందుపల్లిలో పుట్టిపెరిగారు. తల్లి జయప్రద, గహిణి. తండ్రి కోగంటి రంగారావు, బ్యాంక్‌ ఉద్యోగం చేసేవారు. యామిని బీఎస్సీ పూర్తి చేశారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు.

పర్యావరణ పరిరక్షణకై మొదటి నుండి మహిళలు ఆర్థికంగా స్థిరపడాలనే ఆలోచన ఉన్న వ్యక్తిత్వం యామినిది. అందుకే వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. పేపర్‌ బ్యాగ్స్‌, గార్మెంట్స్‌ బిజినెస్‌ ప్రారంభించి తాను ఉపాధి పొందుతూ మరికొంత మంది మహిళలకు ఆదాయ మార్గం చూపుతున్నారు. పర్యావరణ పరిరక్షణను దష్టిలో పెట్టుకొని తాను ప్రారంభించే వ్యాపారం ఎకో ఫ్రెండ్లీగా వుండాలని కోరుకున్నారు. అందుకే పేపర్‌ బ్యాగ్స్‌ తయారీ ప్రారంభించారు. కొంత కాలం తర్వాత యూనీఫామ్స్‌ తయారీ ద్వారా నాణ్యతతో కూడిన వస్త్రాలు, సరసమైన ధరలకు అందించాలనే లక్ష్యంతో గార్మెంట్స్‌ రంగంలోకి ప్రవేశించారు. అదే సమయంలో గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించాలనే ఆలోచన కూడా ఆమెలో కలిగింది.

వ్యాపార వద్ధిలో ప్రయాణం
2006లో పేపర్‌ బ్యాగ్స్‌ వ్యాపారం ప్రారంభించారు. 2016లో గార్మెంట్స్‌ వ్యాపారం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆమె పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వార్షిక టర్నోవర్‌ రూ. 90 లక్షలు. ఆర్డర్ల కోసం ఆమె అనేక విధాలుగా కషి చేస్తున్నారు. ఇంటర్నెట్‌, ఇమెయిల్‌, వాట్సాప్‌, వ్యక్తిగత పరిచయాల ద్వారా తన వ్యాపారాన్ని వద్ది చేస్తున్నారు.

ఇంట్లో సహకారం వుండాలి
భర్త ఎం.విజయ భాస్కర్‌ పూర్తి సహకారంతో యామిని ఈ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ‘ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది అంటారు. నా విజయం వెనుక నా భర్త ఉన్నాడు’ అని ఆమె గర్వంగా చెప్పుకుంటున్నారు. ప్రతి ఇంట్లో ఇలాంటి సహకారం దొరికితే మహిళలు తాము అనుకున్నది సాధించగలుగుతారని ఆమె గట్టిగా చెబుతున్నారు.
కష్టాలు తట్టుకొని వ్యాపారంలో విజయానికి మార్గం ఎప్పుడూ సులభం కాదు. యామినికి కూడా ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. డీమోనిటైజేషన్‌తో నగదు ప్రవాహం నిలిచిపోయి, కోవిడ్‌-19 సమయంలో ఉత్పత్తి నిలిచిపోయి భారీ నష్టాలు ఎదురయ్యాయి. నైపుణ్యంతో కూడిన కార్మికుల కొరత ఉత్పత్తిని ప్రభావితం చేసింది. అధిక విద్యుత్‌, అద్దె, లైసెన్స్‌ ఖర్చులు యూనిట్‌ నడపటంలో భారంగా మారాయి. బ్యాంకుల నిర్లక్ష్యం, బలమైన రుణ చరిత్ర ఉన్నప్పటికీ సహకారం అందకపోవడం ప్రధాన సమస్యగా నిలిచింది. వీటన్నింటినీ తట్టుకొని యామినీ ధైర్యంగా నిలబడ్డారు.
– పాలపర్తి సంధ్యారాణి

వ్యాపారంపైనే దష్టి
”సహజంగా మహిళలు అంటే చాలా మంది చిన్నచూపు చూస్తుంటారు. అనేక రకాలుగా వివక్ష ఎదుర్కొంటున్నారు. అయితే నేను ఇప్పటివరకు ఎటువంటి వివక్షను ఎదుర్కోలేదు. నా దష్టి అంతా వ్యాపారాన్ని అభివద్ధి చేయడంలో చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటాను. ఎవరైనా ఏమన్నా అన్నా సమాధానం చెబుతాను. ముఖ్యంగా అనవసర విషయాల గురించి అస్సలు ఆలోచించను. దాని వల్ల మన సమయం మొత్తం వధా అవుతుంది. ముఖ్యంగా మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడాలి. కుటుంబానికి, సమాజానికి మన వంతు తోడ్పాటును అందించాలి.
యామిని

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -