Tuesday, November 18, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి'విధానాల' చట్రంలో శ్రమశక్తి బందీ

‘విధానాల’ చట్రంలో శ్రమశక్తి బందీ

- Advertisement -

బంగాళాఖాత తీరంలోని సీ-ఫుడ్‌ పరిశ్రమలో బానిస చాకిరీ చేస్తున్న కార్మికులపై అధ్యయనం చేస్తున్న సందర్భంగా ఐసుతో నిండిన టేబుల్స్‌ పై గ్లౌజులు కూడా లేకుండా చేపలు,రొయ్యలు వలిచే మహిళా కార్మికులు నాకు తారసపడ్డారు. వారంతా, వ్యవసాయం వారి కుటుంబాలను దెబ్బతీయగా తప్పనిసరై ఆ పనిలోకి వచ్చిన వారే. అతి తక్కువ వేతనాలే వారికి దక్కేవి. నా సందర్శనకు నెల ముందు వారందరినీ దినసరి వేతన కార్మికులుగా పునర్‌వర్గీకరణ చేశారు. దాంతో ఇఎస్‌ఐ, ఈపీయఫ్‌లు పోయాయి.యాజమాన్యం స్వల్పంగా వేతనాలు పెంచినా,పై రెంటికీ కాంట్రిబ్యూషన్‌ ఆపేయడంతో అదీ కార్మికులకు వర్తించలేదు. దుర్భలమైన ఈ కార్మికులంతా నిర్దిష్ట పనిగంటలు కూడా లేకుండా బానిస చాకిరీ చేస్తున్న కార్మికులే. మన దేశ కార్మిక చట్టాలు ఎంత పెళుసుగా ఉన్నాయో చెప్పేందుకు ఇదొక నిదర్శనం. మన దేశంలో కోటీ పది లక్షల మంది ఆధునిక బానిసలున్న ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ‘శ్రమశక్తి నీతి -2025’కు తెరతీసింది. దీన్ని మనుస్తృతి వంటి కాలం చెల్లిన నీతులతో కలిపి వండి వారుస్తోంది. ‘ఆ కార్మికుల భవిష్యత్తు’ సిద్ధం చేస్తున్నానంటున్న ప్రభుత్వం మన దేశ భయానక వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరిస్తోంది.

యజమానుల కోసమే ఈ విధానం
2021 చివరికాలం నుండి స్టీలు ఫ్యాక్టరీలు, ఇసుక క్వారీలు,చేపలు, రొయ్యల ఫ్యాక్టరీలు,టెక్ట్స్‌టైల్‌ మిల్లుల్లోని వేలాదిమంది కార్మికులను దేశ వ్యాపితంగా ఇంటర్వ్యూ చేశాను. వీరంతా మధ్యవర్తుల ద్వారా రోజు కూలీ పై పనిలోకి తీసుకోబడ్డవారే. వీరెవరికీ ఒప్పందాలు వర్తించవు. వీరంతా ఐఎల్‌ఓ చెప్పిన 90శాతం అసంఘటిత కార్మికుల్లో అంతర్భాగంగా కుమిలిపోతున్న వారే! రాజ్యాంగం కార్మికులకిచ్చిన 14,16, 23 అధికరణాలను ఈవిధానం ఉల్లంఘిస్తుంది. కార్మికుల గౌరవాన్ని భంగపరిచి,వారి వేతనాల కత్తిరింపులకు మార్గం సుగమం చేస్తుంది.ఈ విధానం కార్మికులకు మేలు చేయదు. ‘సాంస్కృతిక వారసత్వం’ పేర యజమానులకు సేవచేసేందుకు ఈ స్వార్ధ పూరిత విధానాలు రూపొందించారు.

ఈపీఎఫ్‌ను, ఈఎస్‌ఐని, ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజనను, ఈశ్రమ్‌, జీవిత పర్యంతం రాష్ట్రాల్లో వచ్చే ప్రమాద, ఆరోగ్య, పెన్షన్‌, ప్రసూతి బీమాలను కలిపేసి ‘సార్వత్రిక సామాజిక భద్రతా నంబర్‌’ను ఇస్తారట! కానీ, దీనికి నిధులివ్వదు.ఏ గిగ్‌ యజమానినీ తమ వాటాగా దీనికి కాంట్రిబ్యూట్‌ చేయాలని గానీ, ప్రభుత్వం తన వాటా ఇవ్వాలని గానీ ఎక్కడా చెప్పలేదు,కనాకష్టంగా నడిచే ఈశ్రమ్‌ నిధులు ఇంకా ప్రమాదంలో పడతాయి. 38శాతం గృహాలకే అక్షరాస్యతున్న నేపథ్యంలో డిజిటల్‌ ఐడీలు ప్రధానంగా మహిళల్ని, వృద్ధుల్నీ, తక్కువ చదువున్న వారినీ 15వ అధికరణాన్ని ధిక్కరిస్తూ మినహాయిస్తుంది.కార్మిక సంఘాలు లేకపోవడమనేది బేరసారాల శక్తి ఇంకా దెబ్బతినడానికి దారితీస్తుంది.ప్రారంభదశలో ఆఫ్‌లైన్‌ పద్ధతే ఉండాలి.త్రైపాక్షిక నిధుల మంజూరు వుండాలి.
లేకుంటే ఇది పచ్చి దోపిడీకి దారితీస్తుంది.

వృత్తిపరమైన భద్రతకి సంబంధించి ఇంతవరకూ ఈ కొత్త ‘నీతి’ 2020ల నాటి వఅత్తిపరమైన భద్రతా, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్‌ ను కచ్చితంగా అమలు చేస్తానని చెప్తుంది.మహిళలకు ప్రమాదమని తెలిసిన చోట,లింగ పరమైన సున్నితాంశాల యెడల ఆడిట్‌ చేయించడం వంటి ఐఎల్‌ఓ తీర్మానం 155 ను అమలు చేస్తా మన్నారు. ఒకపక్క తనిఖీలు చేసే యంత్రాంగం లేదనీ, ఇన్‌స్పెక్టర్లు తక్కువ మంది ఉన్నారని తెలిసికూడా 2047 నాటికి ఒక్క మనిషి కూడా చనిపోని విధంగా వుంటుంది కాబట్టి ఫైన్లను వేసే పద్ధతుల్ని ఎత్తివేయడం ఆశ్చర్యం కలిగించక మానదు.ఈ డిజిటల్‌ పద్ధతులు అసంఘటిత కార్మికుల్ని మినహాయిస్తాయి ఇది సమానత్వాన్ని తోసిరాజంటుంది. గిగ్‌ మానసిక ఆందోళనను పెంచుతుంది.యూనియన్‌ ఆడిట్స్‌ 19వ అధికరణను బలహీనం చేస్తుంది.

ఆందోళన కలిగించే అంశాలు
కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఉపాధి సదుపాయాలు చూపే ఫెసిలిటేటర్‌గా మారనున్నది. కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఉద్యోగాలకు సరిపోయే అభ్యర్థులను ఎంపిక చేయడం, వారి అర్హతలను పరిశీలించడం, నైపుణ్యాలను రెండో, మూడో స్థాయి నగరాలు, అలాగే చిన్న/మధ్య తరహా పరిశ్రమ అవసరాలకు తగినట్టు చేయడం వంటి పనులను ఇది చూస్తుంది.ఇది స్కిల్‌ ఇండియా కార్యక్రమంతో జతకలిసి 91.75శాతం మంది గ్రాడ్యుయేట్‌ ఉద్యోగులకు నైపుణ్యంలోవున్న అసమానతలను తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. అయితే, ఇదంతా కృత్రిమ మేధస్సు ఆధారంతో పనిచేస్తున్నందువల్ల, కులం, లింగ భేద విచక్షణను పట్టించుకోక, రాజ్యాంగంలోని ఆర్టికిల్‌ 15ను అతిక్రమించే ప్రమాదం వున్నది.

‘ఫ్లెక్సిబిలిటీ’ని దుర్వినియోగం చేస్తూ, ఒక కోటి 20 లక్షల మంది కనీసంగా వున్న గిగ్‌ కార్మికులను కనీసం వేజ్‌ కోడ్‌ గురించి శ్రమ శక్తి నీతి ముసాయిదా పట్టించు కోవటంలేదు. అలాగే ఒక ఉద్యోగం నుంచి వేరే దానికి మారే సందర్భంలో ఇవ్వాల్సిన ప్రయోజనాలు స్పష్టంగా లేవు. 2030 నాటికి శ్రామిక శక్తిలో ముప్పయి ఐదు శాతం మహిళల భాగస్వామ్యం ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడున్నది 33.7 శాతం మహిళా శ్రామికులు. వారు ఖర్చు భరించగలిగిన స్థాయిలో పిల్లల సంరక్షణ కేంద్రాలు, వెసులు బాటుగా వుండే గిగ్‌ ఉద్యోగాలు, సమాన వేతనం, అప్రంటీస్‌షిప్పులు కల్పించటం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాలన్నారు. లింగ సమానత్వం గురించి చెప్పే ఆర్టికల్‌ 15కి, కార్మికుల మొబిలిటీకి సంబంధించి అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) విధానాలకు అనుగుణంగా వుండాలి.

ఏమైనప్పటికీ, కోటాలు, పెనాల్టీలు లేకుండా, సరిపడేంత ప్రసూతి సదుపాయాలు లేని సందర్బంలో ఈ లక్ష్యం సాధించటం కష్టం. యువతకున్న మానసిక ఆరోగ్యస్థితిని పట్టించుకోకపోవటం, కుల, లింగ అంతరాల లెక్కలలో దళిత మహిళలు ఎదుర్కొనే ప్రత్యేక సమస్యలు కనిపించవు. నిజమైన గౌరవం, పురోగతి కోసం యూనియన్ల నాయకత్వంలో ఆడిట్‌ చేయటం అత్యవసరం.
శ్రమశక్తి నీతి విధానం గ్రీన్‌ టెక్నాలజీ దృష్టి బొగ్గుగని కార్మికులకు కృత్రిమ మేధ సహాయంతో మెరుగైన భద్రత చర్యలను చేపట్టడం, వారి నైపుణ్యాల పెంపుదల అవకాశాలను ప్రోత్సాహస్తుంది. ఇవి వాతావరణ లక్ష్యాలు సుస్థిరాభివృద్ధి ఉద్దేశ్యాలు 13కీ, జీవనోపాధి హక్కులకు చెందిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21కి లోబడి వుంటాయి. అయితే, ‘ఉపాధి మార్పిడి’ సరైన ఆదాయ మద్దతు లేక అలాగే యూనియన్ల జోక్యం లేకపోతే ఐఎల్‌ఓ నిబంధన 29ని ఉల్లంఫించే ప్రమాదముంది.

గ్రామీణ కృత్రిమమేధ అంతరాలు పెంచడం, పట్టణాలు కేంద్రంగా వుండే గ్రీన్‌ జాబ్స్‌ నలభైకోట్ల మంది చట్టపరిధి కిందికిరాని అసంఘటిత కార్మికులను అణచివేస్తుంది. గౌరవం లేకుండాచేసే ఆర్ధిక దోపిడీ ఉచ్చులో పడకుండా కార్మికులను తప్పించటానికి త్రైపాక్షిక నిధులు, ఓఈసీడీ ప్రమాణాలు తప్పక అవసరమౌతాయి. హక్కుల ఆధారిత భవిష్యత్తు సిద్ధం అంటూ దోపిడీ,డిజిటల్‌ ఆశావాదాల నడుమ వికసిత భారత్‌ లక్ష్యంగా ‘శ్రమశక్తి నీతి-2025’ ఆవిష్కరించబడింది. అయితే దాని వాగాడంబరాం వెనుక అనేక నల్ల మచ్చలున్నాయి. నియంత్రణల అతిక్రమణలు,డిజిటల్‌ పద్ధతులు చేతగాక పోవడంవల్ల బహిష్కృతులు,పెనాల్టీలను అమలు చేయక పోవడం, ఐఎల్‌ఓ నిబంధనలను పాటించకపోవడం వంటివి ఈ కోవకు చెందుతాయి. గిగ్‌ ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్న నేపధ్యంలో ఇవన్నీ యూనియన్స్‌ బలంతగ్గడానికి దారితీస్తాయి.

ఇది కార్మికుల గౌరవం, హక్కులు, న్యాయానికి సంబంధించి..
నిర్దిష్ట నిధుల కేటాయింపు, సంస్థాగతమైన రక్షణలు లేకుండా సార్వత్రిక సామాజిక భద్రత వంటి వాగ్దానాలు వాటి బరువుకు అవే కూలిపోతాయి. బానిస చాకిరీ చేసే అసంఘటిత రంగంలోని కోట్లాది మందికి అందాల్సినవి డిజిటల్‌ డాష్‌ బోర్డులవంటి శుష్కవాగ్దానాలతో కాదు, భారతీయ పేద కార్మికుల గౌరవాన్ని నిలబెట్టి, హక్కులను ఇవ్వడం ద్వారా మాత్రమే సాధ్యం. 2025-47 ప్రయాణానికి సరైన చోదక శక్తులవసరం.హక్కులు సరిగా అమలౌతున్నాయో పరిశీలించే జవాబుదారీతనం వుండాలి. త్రైపాక్షిక యంత్రాంగం, కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు లేని వారు మినహాయించబడకుండా సరైన పారదర్శక యంత్రాంగం ఉండాలి. ఇవన్నీ లేకుండా కోట్లాది కష్టజీవులకు ఏదో ఒరగ బెడతాననడం బూటకమే కాదు, వాగాడంబరం కూడా!
(‘ది హిందూ’ సౌజన్యంతో)
అనువాదం: ఆరెస్బీ

రెజిమోన్‌ కుట్టప్పన్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -