Tuesday, November 18, 2025
E-PAPER
Homeసినిమాభిన్న కథతో 'టార్టాయిస్‌'

భిన్న కథతో ‘టార్టాయిస్‌’

- Advertisement -

ప్రశ్విత ఎంటర్టైన్మెంట్‌, ఎస్‌ కె గోల్డెన్‌ ఆర్ట్స్‌, చందమామ క్రియేషన్స్‌, ఎన్‌ వి ఎల్‌ క్రియేషన్స్‌ పతాకాలపై రూపొందుతున్న చిత్రం ‘టార్టాయిస్‌’. రాజ్‌ తరుణ్‌, అమృత చౌదరి హీరో, హీరోయిన్‌గా, శ్రీనివాస్‌ అవసరాల, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రిత్విక్‌ కుమార్‌ దర్శకత్వంలో శశిధర్‌ నల్ల, విజయ్‌ కుమార్‌, సంతోష్‌ ఇమ్మడి, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సోమవారం ప్రసాద్‌ ల్యాబ్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. అలాగే ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ సందర్భంగా హీరో రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ, ‘ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. చాలా డిఫరెంట్‌ కథ. దర్శకుడు రిత్విక్‌ కుమార్‌ కథ చెప్పిన విధానం చాలా బాగుంది.

ఇంత మంచి కథతో వస్తున్న మా నిర్మాతలకి కంగ్రాట్స్‌. ఈ చిత్రం నా కెరీర్‌కి మంచి కిక్‌ ఇస్తుంది’ అని తెలిపారు. ‘రాజ్‌ తరుణ్‌ కెరీర్‌లో బెస్ట్‌ సినిమా అవుతుంది. శ్రీనివాస్‌ అవసరాల, ధన్య బాలకృష్ణ, హీరోయిన్‌ అమృత చౌదరి క్యారెక్టర్స్‌ చాలా బలంగా ఉంటాయి. కొత్త స్క్రీన్‌ ప్లేతో డిఫరెంట్‌ కథతో మంచి థ్రిల్లర్‌ చిత్రం ఇది. త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తాం’ అని దర్శకుడు రిత్విక్‌ కుమార్‌ చెప్పారు. ‘మాకు ఈ కథ చాలా బాగా నచ్చింది. మా దర్శకుడు రిత్విక్‌ కుమార్‌ పై మాకు పూర్తి నమ్మకం ఉంది. రాజ్‌ తరుణ్‌తో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది’ అని నిర్మాతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -