Tuesday, November 18, 2025
E-PAPER
Homeఆటలుహైదరాబాద్‌ 121 ఆలౌట్‌

హైదరాబాద్‌ 121 ఆలౌట్‌

- Advertisement -

జమ్మూ కశ్మీర్‌ ఆధిక్యం 324 పరుగులు

జమ్మూ : రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-డిలో జమ్మూ కశ్మీర్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్‌ కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే కుప్పకూలిన హైదరాబాద్‌.. 49 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సమర్పించుకుంది. కెప్టెన్‌ రాహుల్‌ సింగ్‌ (48) మినహా హైదరాబాద్‌ తరఫున ఎవరూ రాణించలేదు. 39.2 ఓవర్లలో 121 పరుగలకు హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌ కథ ముగిసింది. జమ్మూ కశ్మీర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులు చేయగా. రెండో ఇన్నింగ్స్‌లో 275/4తో పటిష్టంగా నిలిచింది. ఓపెనర్‌ ఇక్బాల్‌ (50), వివ్రాంత్‌ శర్మ (45) రాణించగా ..అబ్దుల్‌ సమద్‌ (77 నాటౌట్‌), కన్హయ్య (82 నాటౌట్‌) అజేయ అర్థ సెంచరీలతో ఆడుతున్నారు. మరో రెండు రోజుల ఆట ఉండటంతో ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఓటమి నుంచి తప్పించుకోవటం అసాధ్యమే!.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -