Tuesday, November 18, 2025
E-PAPER
Homeజాతీయంఎగుమతుల్లో 12 శాతం పతనం

ఎగుమతుల్లో 12 శాతం పతనం

- Advertisement -

అమాంతంగా పెరిగిన వాణిజ్య లోటు
అక్టోబర్‌లో 34.48 బిలియన్‌ డాలర్లు

న్యూఢిల్లీ : భారత ఎగుమతులు అమాతం పడిపోయాయి. మరోవైపు దిగుమతులు పెరగడంతో.. వాణిజ్య లోటు ఎగిసిపడింది. ఈ ఏడాది అక్టోబర్‌లో భారతదేశ సరుకుల ఎగుమతులు 11.8 శాతం పతనమై 34.38 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. మరోవైపు దిగుమతులు 16.63 శాతం ఎగిసి 76.06 బిలియన్‌ డాలర్లకు ఎగిశాయి. దీంతో గడిచిన నెలలో వాణిజ్య లోటు ఏకంగా 41.68 బిలియన్లుగా నమోదయ్యింది. ఇది సెప్టెంబర్‌లో 32.14 బిలియన్లుగా ఉంది. గడిచిన నెలలో ప్రధానంగా బంగారం, వెండి దిగుమతులు విపరీతంగా పెరిగాయి. దీపావళి పండుగ కారణంగా బంగారానికి డిమాండ్‌ పెరగడం ఇందుకు ఒక కారణమని వాణిజ్య శాఖ వర్గాలు తెలిపాయి.

భారతదేశానికి అతిపెద్ద మార్కెట్‌ అయిన అమెరికాకు ఎగుమతులు భారీగా తగ్గాయి. యుఎస్‌కు గతేడాది ఇదే నెలలో 6.9 బిలియన్ల ఎగుమతులు జరగ్గా.. గడిచిన అక్టోబర్‌లో 6.3 బిలియన్లకు పడిపోయాయి. పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, తోలు ఉత్పత్తులు వంటి ప్రధాన ఎగుమతి వస్తువుల రవాణాలో ప్రతికూల వృద్ధి చోటు చేసుకుంది. ఈ ఏడాది ఆగస్టు 2025 చివరిలో ట్రంప్‌ భారత్‌పై 50 శాతం సుంకాలను విధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అస్థిరమైన వస్తువుల ధరలు ఎగుమతులపై ప్రభావం చూపాయని వాణిజ్య శాఖ వర్గాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -