నన్ను విమర్శించే నాయకులను ఎవరూ రక్షించలేరు : జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ-మధిర
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా, ప్రతిపక్ష పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీ వైఫల్యాల వల్లనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందని జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం ముందస్తుగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడిపల్లి గ్రామంలో లెదర్ పార్క్‌ను సందర్శించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులను దీర్ఘకాలికం ఎవరూ రక్షించలేరని తెలిపారు. ప్రజా జీవితంలో వారిపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పి తీరాల్సిందేనని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు జాగృతి సంస్థ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. ప్రజల్లో ఉంటూ సమస్యలపై పోరాటం చేస్తూ జాగృతి సంస్థను బలోపేతం చేయనున్నట్టు వెల్లడించారు.
బీఆర్‌ఎస్, బీజేపీ వైఫల్యంతోనే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



