Tuesday, November 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత..

తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమ క్రమంగా పెరుగుతోంది. దీపావళి తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గిపోయి, చలి తీవ్రత పెరుగుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాబోయే రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. ఈ రెండు రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నాలుగు నుంచి ఐదు డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే ఛాన్స్‌ ఉన్నట్లు కూడా వెల్లడించింది. అదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆసిఫాబాద్ లాంటి జిల్లాల్లో చలి గాలులు వీస్తాయని కూడా పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -