– 4వ రాష్ట్ర మహాసభలు
– జెండావిష్కరణ చేసిన సీనియర్ వర్కర్ వెంకట నర్సమ్మ
– హాజరైన సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
– మధ్యాహ్నం భోజన కార్మిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వీ. రమ
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ నెల 17,18 రోజులుగా జరుగుతున్న తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర నాలుగవ మహాసభ రెండవ రోజు ప్రారంభమైంది. ముందుగా కొత్తగూడెం జిల్లాకు చెందిన సీనియర్ వర్కర్ వెంకట నరసమ్మ జెండావిష్కరణ చేశారు. అమరవీరుల స్థూపానికి సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ, ప్రతినిధులు కలిసి నివాళులర్పించారు. అనంతరం రంజన్ నిరులా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారుల చేత అమరవీరుల గేయాలాపనల మధ్య ప్రతినిధుల సభ ప్రారంభమైంది. కార్మికులు నినాదాలతో సభా ప్రాంగణ మారుమోగింది. మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని నినందించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. రాజకీయ వేధింపులు లోపాలని నినాదాలు చేశారు. విప్లవం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గత మహాసభ మొదలుకొని నేటి వరకు వివిధ సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన వీరులకు మహాసభ సంతాప తీర్మానం ప్రవేశపెట్టింది. పాలడుగు భాస్కర్ ప్రారంభ ఉపన్యాసం చేశారు.



