నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్నది. మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదంటూ, ప్రభాకర్ రావు అరెస్టుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత విచారణలో ఫోరెన్సిక్ నిపుణుల ముందు ఐ క్లౌడ్ పాస్ వర్డ్ రీసెట్ చెయ్యాలని ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ నాగరత్న ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేస్తూ, “దర్యాప్తు ప్రక్రియలో సహకరించడం ప్రతి నిందితుడి బాధ్యత. సిట్ అడిగిన వివరాలు ఇవ్వకపోవడం చట్టవిరుద్ధం,” అని వ్యాఖ్యానించింది. ముఖ్యంగా ప్రభాకర్ రావు తన క్లౌడ్ డేటా, అలాగే యాపిల్ క్లౌడ్‌లో ఉన్న సమాచారం మొత్తం సిట్‌కు అందించాలన్నది కోర్టు స్పష్టం చేసింది.
నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



